మా లాంటి బాధ ఎవరూ పడకూడదు: బాధితులు

మార్కాపురం జిల్లా వైద్యశాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మృతదేహాలను పోలీసు అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైద్యశాల ప్రాంగణంలో కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. తాము ఎదుర్కొంటున్న బాధ ఇంకెవరూ పడకూడదని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్