కొనకనమిట్ల మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సిద్దవరం గ్రామంలో సోమవారం, వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల పేదలు నష్టపోతారని అన్నా వెంకట రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సేకరించిన సంతకాలతో గవర్నర్ ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్