మార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ పెట్రోలియం బంక్ వద్ద టైర్లు మార్చుకుంటూ నిలిపి ఉన్న ఎస్ఎల్వీటి ప్రైవేట్ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.