మార్కాపురం జిల్లాలో ప్రజల రెవెన్యూ సమస్యలను గ్రామస్థాయిలోనే వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం 'వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రతి మండలంలో ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా ప్రత్యేక రెవెన్యూ గ్రామ సందర్శనలు నిర్వహించబడతాయి.