మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని, పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిందని ఈ సందర్భంగా తెలిపారు.