ఫిబ్రవరి 1న సెలవు దినం కావడంతో, కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఇండ్ల వద్దకే పెన్షన్లు పంపిణీ చేసిందని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి శనివారం తెలిపారు. ప్రజా ప్రతినిధులు నెలకు 25 రోజులు ప్రజల మధ్యనే గడుపుతూ, వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.