పొదిలి: భారీ గాలులతో నేలకొరిగిన విద్యుత్ స్తంభం

మార్కాపురం జిల్లా పొదిలిలో గురువారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి. బెస్తపాలెం పొగాకు బోర్డు సమీపంలో బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభం విరిగి పడి, విద్యుత్ తీగలు తెగి రహదారిపై పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది.

సంబంధిత పోస్ట్