పొదిలి మండలం ఏలూరు గ్రామంలోని పాలీషింగ్ యూనిట్ లో గ్రానైట్ రాళ్లు కట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రాయి పడడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు శుక్రవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.