పొదిలిలో సోమవారం పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ఎరువులను, పంటలకు పిచ్చికారి చేసే మందులను పరిశీలించారు. వాటిపై ఎక్స్పైరీ డేట్ ఎమ్మార్పీ ధరలు తప్పనిసరిగా ఉండాలని ఎరువుల దుకాణాల యజమానులకు విజిలెన్స్ అధికారులు తెలిపారు. అలానే రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు దుకాణ యజమానులకు తెలిపారు.