పొదిలి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

ప్రకాశం జిల్లా పొదిలిలోని రాజుపాలెం రోడ్డులో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ యువకుడిని అంబులెన్స్ లో పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మార్క స్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియలేదని పోలీసులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

సంబంధిత పోస్ట్