పొదిలిలో రేపు మంగళవారం విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏ. ఈ మోహన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగర పంచాయతీ పరిధిలోని పాతూరు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలన్నారు. వ్యవసాయ పొలాలకు కూడా విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.