మార్కాపురం జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా సెల్లార్, అండర్ గ్రౌండ్ షాపుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు. ఈ సంఘటనతో పట్టణంలో నీటి నిల్వ సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది.