గజ వాహనంపై ఊరేగిన రాములవారు

మార్కాపురం పట్టణంలోని కోనేటి వీధి శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి శ్రీరామచంద్రుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని ప్రధాన వీధుల్లో ఊరేగించగా, రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్