మార్కాపురం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలునిర్వహించాలి..కలెక్టర్

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా విశిష్టతను తెలియజేయడంతో పాటు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రాజాబాబు ఆదేశించారు. ఈ వేడుకలను స్థానిక ఎస్.వి.కె.పి కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ మైదానాన్ని పరిశీలించి, అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్