గంజాయి అమ్మే వారి వివరాలు చెబితే రూ. 10 వేలు రివార్డు

మార్కాపురం నియోజకవర్గంలో గంజాయి అమ్మేవారి వివరాలు చెబితే రూ. 10 వేలు నగదు బహుమతిగా ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్