మార్కాపురంకు చెందిన దేవరకొండ మల్లేశ్వరి అనే మహిళ గత 13 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లీశ్వరిని యర్రగొండపాలెం లో చికిత్స అందిస్తుండగా అదృశ్యమైందని, ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరైనా మల్లీశ్వరిని గుర్తించి సమాచారం అందిస్తే రూ.10వేలు రివార్డు ఇస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందించేందుకు 9392480980 నంబర్ ను సంప్రదించాలని కోరారు.