మార్కాపురం మండలం ఎండూరు వారి పాలెం వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8,900 నగదు, 6 మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.