మార్కాపురం జిల్లా పొదిలి మండలం మాదాలవారి పాలెం సమీపంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సుల్లో పొగలు వ్యాప్తి చెందాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా దించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.