పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం పొదిలి మండలం దొండ్లేరు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, పొలాలను సమగ్రంగా సర్వే చేసి ఖచ్చితమైన హద్దులతో పాస్ పుస్తకాలను ప్రభుత్వం ముద్రించిందని ఆయన తెలిపారు. వీటిని ఆదివారం నాటికి రైతులకు పంపిణీ చేసే ప్రక్రియను ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాస్ పుస్తకంలోని అంశాలను రైతులకు స్వయంగా వివరించారు.

సంబంధిత పోస్ట్