స్థలాన్ని కబ్జా చేసి బెదిరిస్తున్నారు

పొదిలి మండలం దేవరంపాలెంకు చెందిన పెండేల వెంకటసుబ్బయ్య తన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి, తమపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చీమకుర్తి మండలం పరిధిలోని మర్రిచెట్ల వద్ద ఉన్న తన 318 గదుల ఆస్తిని కబ్జా చేశారని, తనపై ఎస్సీ, అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. తహసీల్దార్, సీఐలకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్