మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు బుధవారం కొనకనమిట్ల మండలంలో జరిగిన గ్రామస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 2029 ఎన్నికలలో మరోమారు గెలిచి జగనన్నే సీఎంగా వస్తారని ఆయన అన్నారు. కమిటీ సభ్యుల ఎన్నిక అనంతరం పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన పద్ధతులపై కార్యకర్తలకు వివరించారు. స్థానిక ఎన్నికలలో పార్టీ సత్తా చాటే విధంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.