మార్కాపురంలో దొంగలు హల్చల్

మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో దొంగల బెడద ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. కంభం రోడ్ లోని దర్శి రామకృష్ణ హాస్పిటల్ సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడేందుకు దొంగలు ప్రయత్నించారు. సీసీ కెమెరాలను గమనించి వాటిని ధ్వంసం చేసి పారిపోయారు. అయితే, వారి కదలికలు కొంతవరకు రికార్డు కావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్