మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్ తండ్రి, ఉస్మాన్ అలీ బేగ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఎంతోమంది ముస్లింలకు ఉన్నత విద్యను అందించిన ఘనత ఆయనకు దక్కిందని స్థానికులు తెలిపారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త స్థానికంగా విషాద ఛాయలు అలుముకుంది.