ప్రాణాలకు తెగించి మరి ప్రాజెక్టు పరిశీలించాం

మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి శనివారం జిల్లా అభినందన సభలో మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి వెలిగొండ ప్రాజెక్టును 17 కిలోమీటర్లు లోపలికి వెళ్లి పరిశీలించి వచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా ప్రాజెక్టును లోపలికి వెళ్లి పరిశీలించారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణలో టన్నెల్ కూలిపోయి చాలామంది మరణించారని, వారి మృతదేహాలు కూడా దొరకలేదని ఆయన గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టులో కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయితే తమ ప్రాంతంలో 50 లక్షల ఎకరాలకు పైగా భూమి ధర పలుకుతుందని, ధరలు పెరిగితే తనకు లేదా సీఎం చంద్రబాబుకు లాభం ఏమైనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్