మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఈ నెల 30వ తేదీలోపు ప్రతి ఒక్కరూ స్వీయ గణన పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో 5కే రన్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.