మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సి. ఎఫ్. ఎం సంస్థ నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సంస్థ సభ్యులు సర్టిఫికెట్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం దీపం పథకం మరియు ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.