ఏపీలో స్లీపర్ క్లాసులు రద్దు అవుతాయి..?

ఆంధ్రప్రదేశ్‌లో స్లీపర్ క్లాస్ బస్సులు రద్దు చేయాలనే వాదనపై రవాణా శాఖ మంత్రి బుధవారం స్పష్టత ఇచ్చారు. ఇటీవల మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతిచెందగా, 28 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో స్లీపర్ క్లాస్ బస్సులు రద్దు చేస్తామని ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, స్లీపర్ క్లాస్ బస్సులను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో 2000కు పైగా స్లీపర్ క్లాస్ బస్సులు తిరుగుతుండటంతో, బస్సు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్