ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో నల్లగడ్డ స్రవంతి అనే టీచర్ అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న స్రవంతి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మృతురాలి మోకాళ్లు నేలను తాకే స్థితిలో ఉండడం అనుమానాలకు తావిస్తోందని ఆమె తల్లి ఆరోపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.