వెలిగొండపై మాట్లాడేందుకు వైసిపికి సిగ్గుండాలి

మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి మంగళవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసిపి నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని, మళ్లీ 4,000 కోట్లు కావాలని వైసిపి నాయకులు మాట్లాడటం సిగ్గులేనితనమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, ప్రకాశం ప్రాంతానికి నీరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బహిరంగ చర్చకు సిద్ధమని, ఎక్కడైనా వచ్చి మాట్లాడేందుకు సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్