ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో హైవేపై అర్ధరాత్రి గంజాయి తరలిస్తున్న లారీని డ్రైవర్ వదిలేసి పారిపోయాడు. అదే సమయంలో ఆగి ఉన్న లారీని బైక్‌పై వెళ్తున్న కొడియన్ లోకేశ్ (20) ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా పోలీసులు లారీని తనిఖీ చేయగా, సుమారు 500 కిలోలకు పైగా గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.