మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడు

ఒంగోలులో మైనర్ బాలికను ఓ యువకుడు వివాహం చేసుకున్న సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం, బాలిక తల్లిదండ్రులు, యువకుడు, అతని బంధువులతో పాటు యువతిని పోలీసులు విచారణకు టూటౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అక్కడ ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరిగి, స్టేషన్ ఆవరణంలోనే గొడవకు దిగారు. ఈ ఘటనతో కొత్తపట్నం రోడ్డుపై వెళ్లే ప్రజలు పోలీస్ స్టేషన్ వైపు ఆకర్షితులయ్యారు. సీఐ శ్రీనివాసరావు జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్