ఒంగోలు, టంగుటూరు ప్రాంతాలలో 16వ నంబర్ జాతీయ రహదారిపై ఫెన్సింగ్ లేకపోవడం వల్లనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి డిఆర్సి సమావేశంలో పేర్కొన్నారు. అధికారులు సర్వీస్ రోడ్ల పరిస్థితిని పరిశీలించి, రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై పెన్సింగ్ ఏర్పాటుతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.