ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి కొరకు ఒక రాష్ట్రం ఉండాలని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించారని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆయన పట్టుదలతోనే తెలుగువారికి ముఖ్య గుర్తింపు వచ్చిందని, ఆయన పట్టుదల, కార్య దీక్ష అందరికీ ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.