చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మరో కేసు

ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం, అత్యవసర అంబులెన్స్ సేవలకు ఆటంకం కలిగించారని తిరుపతి పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరో 40 మందిపై కేసు నమోదు చేశారు. ఇటీవల 226 రోజుల తర్వాత అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన ఆయనపై ఈ కొత్త కేసు నమోదవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్