ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని దశరాజు పల్లి సమీపంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న గంజాయిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. లారీలో ఐదు క్వింటాల గంజాయిని తరలిస్తుండగా లారీ డ్రైవర్ తమిళనాడు పోలీసులను చూసి లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. అంతకు ముందు కొంత మంది గంజాయి ముద్దాయిలను పట్టుకున్న సమయంలో లారీ గురించి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.