రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ పై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ కలిగి ఉండాలని, ఆపద సమయంలో పోలీసులను సంప్రదిస్తే తక్షణమే రక్షణ కల్పిస్తారని పోలీసులు తెలిపారు. మహిళల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు.