ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం పోలీసులు మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఈ యాప్ ను రూపొందించిందని, ఆపద సమయంలో దీని ద్వారా పోలీసులను సంప్రదిస్తే వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తారని పోలీసులు వివరించారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి యాప్ డౌన్లోడ్ చేయించారు.