ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్ ప్రతి స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తామని తెలిపారు.