ఒంగోలులో బుధవారం, ఈగలు టీం మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు యువతకు గంజాయికి దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, దేశ భవిష్యత్తును దెబ్బతీసేందుకు శత్రుదేశాలు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. యువత బాగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు.