ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాలు

మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ పై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బుధవారం మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలు, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాలలో మహిళలకు యాప్ పై అవగాహన కల్పించి, వారి స్మార్ట్ ఫోన్లలో పోలీసులు డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో మహిళలు రక్షణ కోసం ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే, వెంటనే పోలీసులు వారి వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్