ఒంగోలులో జరిగిన జనసేన సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎన్నికల తర్వాత జనసేనలో చేరానని తనపై వచ్చిన ఆరోపణలపై భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని పుకార్లు సృష్టించారని ఆయన ఆరోపించారు. డ్వాక్రా నిధుల దుర్వినియోగం వంటి నీచ రాజకీయాలు తాము చేయబోమని, అలాంటి పనులు చేసిన వారిపై విచారణ జరిపి శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.