కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీవై నిరాహార దీక్ష

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు నరాల శ్రీనివాస్ యాదవ్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1,000 ఎకరాలు కేటాయించాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని, సమగ్ర కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్