మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును ఉద్దేశించి, తనపై అసత్య ప్రచారాలు చేస్తూ దొంగ లెటర్లు రాయించలేదని తన కూతురిపై ఒట్టేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. తాను అవినీతికి పాల్పడ్డానని చెబుతున్నారని, అధికారంలో ఉన్న మీరు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని తన కొడుకుపై ప్రమాణం చేస్తున్నానని బాలినేని తెలిపారు. కూటమిలో నాయకుల మధ్య విభేదాలతో అధిష్టానం తల పట్టుకుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.