ప్రకాశం జిల్లా చీమకుర్తి బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఢీకొన్న ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోగా, వారిపై నుంచి ట్రాక్టర్ దూసుకుపోయింది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, గాయపడిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.