ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో పీఫోర్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి ఆర్వో ప్లాంట్ను కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల, మేయర్ గంగాడ సుజాతలు శనివారం ప్రారంభించారు. అనంతరం 50% రాయితీపై పశువులకు పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.