ఒంగోలు పట్టణంలోని రామ్ నగర్ లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రతినెల 1వ తేదీ కల్లా అధికారులు పెన్షన్లు ఇంటి వద్దకే తీసుకువచ్చి అందిస్తున్నారా లేదా అని లబ్ధిదారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెన్షన్ దారులకు ఇబ్బంది జరగకుండా ఇంటి వద్దకే తీసుకువచ్చి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.