టంగుటూరుకు చెందిన వైసీపీ నేత పేర్రాజు, దళిత సంఘాల నాయకులు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిసి మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబుపై ఫిర్యాదు చేశారు. సింగరాయకొండలో ఇటీవల ఆదిమూలపు సురేశ్ సమక్షంలో తనను దుర్భాసలాడాడని, అప్పుడే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్రాజు తెలిపారు. కొండపి నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీకి చెందిన ఎస్సీ నాయకులు హరిబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.