ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జిల్లాలో దాదాపు 11.72 లక్షల ఇంటి మీటర్లు ఉండగా, ట్రూఅప్ ఛార్జీల కింద రూ. 250 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. ఇకపై ఈ ట్రూఅప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించనుంది. దీంతో కరెంట్ బిల్లులు తగ్గనున్నాయి. అలాగే, ట్రూడౌన్ పేరుతో యూనిట్కు 13 పైసలు తగ్గించడంతో, జిల్లా ప్రజలకు నెలకు రూ. 1.76 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రభుత్వం తెలిపింది.