ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటం వల్లే మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వివరాలు తెలిసిన వారు నేరుగా జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ శ్రీరామ్ కోరారు.