ప్రకాశం జిల్లా వైసిపి అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం ఒంగోలులో మాట్లాడుతూ, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తుందని ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.